Abn logo
Apr 3 2020 @ 13:43PM

బాల‌కృష్ణ‌కి థాంక్స్ చెప్పిన చిరంజీవి

క‌రోనా వైర‌స్ నివాణ కోసం మ‌న టాలీవుడ్ తార‌లంద‌రూ త‌మ‌వంతు సాయంగా అటు కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ రూ.1 కోటి 25 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాల‌కృష్ణ‌కు ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘‘ప్రియమైన సోదరుడు బాలకృష్ణ‌కు ధ‌న్య‌వాదాలు. ప్ర‌తి క‌ష్ట‌స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. సినీ కార్మికుల‌కు రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు విరాళం అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు చిరంజీవి.

Advertisement
Advertisement
Advertisement