Oct 23 2021 @ 08:49AM

మెగా అభిమానికి చిరు సహాయం ..

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులు ఆపదలో ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆదుకోవడానికి సిద్దమైపోతుంటారనే విషయం ఇప్పటికే పలుమార్లు చూశాము. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ జిల్లాకి చెందిన తన అభిమాని వెంకట్‌ను ఆదుకున్నారు. గతకొంతకాలంగా వెంకట్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. దాంతో ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు చిరు దృష్టికి తీసువచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్.. వెంకట్‌ను వెంటనే హైదరాబాద్‌కు మెరుగైన వైద్యం కోసం తీసుకురమ్మని, పూర్తిగా వైద్య ఖర్చులు తానే భరిస్తానని భరోసా ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు. దీంతో మెగా అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు. 


ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ఆయన హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకుడు. చిరుతో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మోహన్ రాజా డైరెక్షన్‌లో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. అలాగే 'భోళా శంకర్', బాబీ డైరెక్షన్‌లో చేసే సినిమాలు మొదలవ్వాల్సి ఉంది.