Oct 27 2021 @ 12:30PM

కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు చిరు గ్రీన్ సిగ్నల్..?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..అంటే ప్రస్తుతం అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ మార్తాండ' సినిమాకు మెగాస్టార్ తాజాగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలోని ప్రధాన పాత్రల ఇంట్రడక్షన్స్‌కు సంబంధించిన వాయిస్‌నే మెగాస్టార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య 'వందేమాతరం' అనే సినిమా గురించి చర్చించారట. వాస్తవంగా కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్‌ మెగాస్టార్ రాజకీయాలలోకి వచ్చే సమయంలో అనుకున్నది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా వార్తలు వినిపిచాయి. కానీ ఎందుకనో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ మొదలవలేదు. ఈ స్క్రిప్ట్ కృష్ణవంశీకి ఎంతో ఇష్టమైనది. దాన్ని సినిమాగా చేస్తే చిరుతోనే అని ఆయన ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేకలకి ఈ ప్రాజెక్ట్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారట. త్వరలో దీనిపై ఓ స్పష్ఠత రానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' మూవీని సెట్స్ మీదకి తీసుకువచ్చారు. ఇక నవంబర్ 15 నుంచి భోళా శంకర్ మొదలవబోతోంది.