Abn logo
Aug 12 2020 @ 10:02AM

మెగాస్టార్ కామ‌న్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నదెవ‌రంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాన గ‌ణం.. క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లోనే అంటే ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రో్జు. మ‌రి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉన్న స‌మ‌యంలో మెగాభిమానులు సంద‌డి చేయ‌డానికి వీలులేకుండా పోయింది. దీంతో ప్ర‌స్తుత ట్రెండ్‌ను అనుస‌రించి సోష‌ల్ మీడియాలో హంగామా క్రియేట్ చేయ‌డానికి మెగాభిమానులు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా 65 మంది సినీ ప్ర‌ముఖుల‌తో సీడీపీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా మ‌ల‌యాళ సూర్‌స్టార్ మ‌మ్ముట్టితో కామ‌న్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆగ‌స్ట్ 21 సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మహేశ్ అభిమానులు 60.2 మిలియ‌న్ ట్వీట్స్‌తో సోష‌ల్ మీడియా ట్రెండింగ్‌లో వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రిప్పుడు మెగాభిమానులు ఈ రికార్డ్ క్రాస్ చేస్తారో లేదో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement