Jul 31 2021 @ 18:14PM

ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లోనే ఉంటారు: చిరు, బన్నీ

తెలుగు సినిమా ప్రస్థానంలో కామెడీ కింగ్‌గా పేరొందిన నటులలో దివంగత నటుడు అల్లు రామలింగయ్య ఒకరు. ఇంకా చెప్పాలంటే కామెడీకే కొత్త అర్థం తెచ్చిన కమెడియన్ ఆయన. శనివారం (జూలై 31) ఆయన వర్ధంతి సందర్భంగా అల్లు, మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు రామలింగయ్యను స్మరించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అల్లు రామలింగయ్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒక డాక్టర్‌గా, యాక్టర్‌గా, ఫిలాసఫర్‌గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా.. ‘సినిమాలపై ఆయనకున్న అభిరుచి, ఆయన జీవిత ప్రయాణం మనలో చాలా మందికి స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు అల్లు రామలింగయ్య మనవడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.


‘‘శ్రీ అల్లు రామలింగయ్య‌గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి. ఒక డాక్టర్‌గా, యాక్టర్‌గా, ఫిలాసఫర్‌గా, ఓ అద్భుతమైన మనిషిగా, నాకు మావయ్యగా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


‘‘రైతు, దిగ్గజ నటుడు, ఒక గొప్ప వ్యక్తి అయిన మా తాత అల్లు రామలింగయ్యగారి వర్ధంతి నేడు. సినిమాలపై ఆయనకున్న అభిరుచి, ఆయన జీవిత ప్రయాణం మనలో చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఆయన మన హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు..’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.