Abn logo
Sep 20 2021 @ 22:38PM

చిరంజీవిరెడ్డి ఇంట ఎంపీటీసీల సందడి

ఎంపీటీసీ విజేతలతో చిరంజీవిరెడ్డి

కలిగిరి, సెప్టెంబరు 20: మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు వైసీపీ ఏకగ్రీవం కావడం, ఆదివారం వచ్చిన ఫలితాల్లో ఎనిమిది వైసీపీ, ఒకటి టీడీపీ కైవసం చేసుకున్నాయి. దీంతో నామినేషన్ల సమయంలోనే ఎంపీపీ అభ్యర్ధిగా చిరంజీవిరెడ్డి సతీమణి శిరీషారెడ్డిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఫలితాలు వెలువడినప్పటి నుంచి గెలిచిన ఎంపీటీసీలు ఒక్కొక్కరు అనంతపురంలోని చిరంజీవిరెడ్డి స్వగృహానికి వెళ్లి చిరంజీవిరెడ్డి, శిరీషారెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆయన పూలమాలలతో అభినందించారు.