వెంకయ్యనాయుడు గారు త్వరగా కోలుకోవాలి.. అని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. కరోనా థర్డ్ వేవ్ వైరస్ 'ఒమైక్రాన్' విపరీతంగా వ్యాపిస్తూ రోజు రోజుకూ పాజిటివ్ కేసులు లెక్కకు మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ మేరకు ఆయన.. 'ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కరోనా నుంచి వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మీరు కోలుకోవాలి సర్'.. అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఆయనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు.