Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 11:39:04 IST

Chiranjeevi: రాఖీ కట్టించుకోవటమే కాదు..మాటివ్వాలి.

twitter-iconwatsapp-iconfb-icon

నేడు దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల కాలంలో చిరంజీవి ఎలాంటి సందర్భం వచ్చినా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ విషెస్ తెలపడం, శుభాకాంక్షలు చెప్పడం..కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అందుకున్న వారికి, తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న వారికీ అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు, అన్నా-చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కలిసి రాఖీ పండుగ(రక్షా బంధన్)ను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.

ఈ ఏడాది వచ్చిన తిథి, నక్షత్రం ప్రకారం ఈరోజు, రేపు.. రెండు రోజులు ఈ పండుగను జరుపుకుంటున్నారు. అయితే, ఈ సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన "రాఖీ కట్టించుకోవటమే కాదు. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి. నా సోదరసోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు"..అని తెలిపారు. మెగా ఫ్యామిలీలోనూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఆయన నటిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్‌తోనే తెరకెక్కుతోంది.

గత ఏడాది రాఖీ పండుగకే ఈ మూవీ నుంచి చిరంజీవి..ఆయనకి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేష్‌ (Keerthi Suresh)ల పోస్టర్‌ను వదిలారు. ఇందులో కీర్తి..చిరుకు రాఖీ కడుతున్నట్టుగా ఉంది. అంటే, భోళా శంకర్ సినిమాలోనూ అలాంటి సందర్భం, సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. కాగా, మెగాస్టార్ ప్రస్తుతం గాడ్ ఫాదర్ (God Father), మెగా 154 చిత్రాలలోనూ నటిస్తున్నారు. దసరా బరిలో గాడ్ ఫాదర్ దిగబోతుండగా, 2023, సంక్రాంతికి మెగా 154 రిలీజ్ కాబోతుంది. ఇక భోళా శంకర్ విడుదలపై క్లారిటీ రావాల్సి ఉంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement