Apr 13 2021 @ 14:33PM

సిద్ధ పై 'ఆచార్య' ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ మెగాస్టార్‌కి జంటగా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే మెగాస్టార్ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా చరణ్ ఈ సినిమా సిద్ధగా కీలక పాత్రలో నటిస్తుండగా నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే.. చరణ్ కి జంటగా కనిపించబోతోంది. సీనియర్ హీరోయిన్ సంగీత, యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 13న గ్రాండ్‌గా 'ఆచార్య' సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. 

ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న రాం చరణ్ - పూజా హెగ్డేల మీద పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కాగా  ఉగాది పండుగ సందర్భంగా సిద్ద - నీలాంబరి పోస్టర్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పాటలోనిదే ఈ పోస్టర్ లుక్ అని తెలుస్తోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన సిద్ధ - నీలాంబరి పోస్టర్ లుక్‌ని ఉద్దేశించి ఆచార్య ( మెగాస్టార్ ) ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. # ఆచార్య ఉగాది శుభాకాంక్షలు .. అంటూ తనదైన శైలిలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.