Abn logo
Apr 8 2021 @ 18:51PM

‘వకీల్‌ సాబ్‌‌’ కోసం నేనూ వెయిటింగ్‌: మెగాస్టార్‌

కొన్ని గంటల్లో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌‌’ చిత్రం విడుదల కాబోతోంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌ రాజు- లక్ష్మణ్‌ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదల కాబోతోంది. ఓవర్సీస్‌లో మాత్రం ఏప్రిల్‌ 8 అంటే ఇంకొన్ని గంటల్లో షోస్‌ మొదలుకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు పవన్‌ కల్యాణ్ సినిమాపై అన్న మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

''చాలా కాలం తర్వాత పవన్‌ కల్యాణ్‌ని వెండితెర మీద చూడటానికి మీలానే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌ సాబ్‌ చూస్తున్నాను. సినిమాపై నా స్పందన తెలియజేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.. " అని చెబుతూ.. తన తమ్ముడికి తానే మేకప్ వేస్తున్న పిక్‌ని మెగాస్టార్ చిరంజీవి షేర్‌ చేశారు. ఈ ట్వీట్‌తో మెగాభిమానుల్లో ఆనందం ఉరకలేస్తుంది. అన్నయ్యా.. థ్యాంక్స్‌ అంటూ కొందరు మెగాభిమానులు కామెంట్స్‌ చేస్తుంటే.., సినిమా చూసొచ్చాక.. అత్యుత్సాహం ఆపుకోలేక మొత్తం స్టోరీ ఇక్కడ చెప్పేస్తారేమో.. అనే భయంగా ఉంది అన్నయ్యా.. అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తుండటం విశేషం.

Advertisement
Advertisement
Advertisement