Abn logo
Aug 9 2020 @ 16:35PM

విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై చిరు తీవ్ర దిగ్భ్రాంతి

విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకూ 11మంది మృతదేహాలను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 50 మందికి పైగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ సంఘటనపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 


‘‘విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి నిర్లక్ష వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది..’’ అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఘటన కారణంగా తను ఈరోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని తెలిపిన వీడియోను పోస్ట్ చేయడం లేదని మరో ట్వీట్‌లో చిరు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement