Abn logo
Oct 26 2020 @ 12:25PM

అన్నయ్య టైటిల్‌తో పవన్‌

అన్న చిరంజీవి సినిమా టైటిల్‌తో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సందడి చేయబోతున్నారా! అంటే అవుననే సమాధానం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దసరా సందర్భంగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయబోతున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియునుమ్‌' సినిమాకు ఇది రీమేక్‌. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో పవన్‌కల్యాణ్‌ నటిస్తుంటే.. మరో పాత్రలో రానా దగ్గుబాటి నటించబోతున్నారని టాక్‌. కాగా.. ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. బిల్లాగా పవన్‌, రంగా పాత్రలో రానా కనిపిస్తారట. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్‌ తప్పేలా లేదు. 'వకీల్‌సాబ్‌' తర్వాత పవన్‌ ఈ సినిమాను స్టార్ట్‌ చేస్తాడని సమాచారం. 


Advertisement
Advertisement
Advertisement