Aug 4 2021 @ 13:46PM

Chiranjeevi: చిరంజీవి కోసం ఆ డైరెక్టర్ టైటిల్ ఇచ్చేశాడా?

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల‌లోనే ‘లూసిఫ‌ర్’ రీమేక్ షూటింగ్‌ను మెగాస్టార్ లాంఛ‌నంగా స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు తెలుగు టైటిల్ ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై చాలా ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. లేటెస్ట్‌గా లూసిఫ‌ర్ తెలుగు రీమేక్‌కు ‘గాడ్‌ఫాద‌ర్’ అనే టైటిల్‌ను పెట్టాల‌నుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. కాగా.. ఈ టైటిల్‌ను సంప‌త్ నంది రిజిష్ట‌ర్ చేయించుకున్నారు. దీంతో మెగా క్యాంప్ డైరెక్ట‌ర్ సంప‌త్ నందిని టైటిల్ కోసం సంప్ర‌దించింది. మ‌రో వైపు మెగాస్టార్ చిరంజీవి సైతం ఫోన్‌లో మాట్లాడారట. మెగాస్టార్ అడ‌గ‌టంతో సంప‌త్ టైటిల్ ఇవ్వ‌డానికి ఓకే చెప్పిన‌ట్టు టాక్. చిరంజీవి పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తార‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.