Abn logo
Mar 26 2020 @ 21:49PM

చరణ్ పుట్టినరోజు తనకు ఎంత ప్రత్యేకమో చెప్పిన చిరు

మార్చి 27వ తేదీన(శుక్రవారం) మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటికే కోట్లాది మంది అభిమానులు సోషల్‌మీడియా ద్వారా అడ్వాన్స్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే చెర్రీ ఓ ప్రత్యేకమైన వ్యక్తి నుంచి అంతే ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు.. అది మరెవరో కాదు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి. 


మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్‌మీడియాలోకి వచ్చిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులకు మరింత చేరువ అయ్యారు. అయితే తన కుమారుడి పుట్టినరోజు తనకు ఎంత ప్రత్యేకమో తాజా పోస్ట్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. చరణ్ పుట్టిన రోజు ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం’. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ చిరు పోస్ట్‌ను రాసుకొచ్చారు. 


చిన్ననాటి చరణ్‌ను ముద్దాడుతున్న ఫొటోని పోస్ట్‌ చేసిన చిరు ‘‘చరణ్ పుట్టినప్పుడు నాకు పట్టరాని సంతోషం వేసింది. అందుకు కారణం అతను మార్చి 27వ తేదీన పుట్టడమే కావొచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం. అందుకే అతను నటనని చేప నీటిలోకి వెళ్లినట్లు స్వీకరించాడు. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి’’ అంటూ చిరు పోస్ట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement