Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 23 Jan 2022 17:44:34 IST

మెగాస్టార్ షేర్ చేసిన బెంగాలీ చిత్రం ట్రైలర్

twitter-iconwatsapp-iconfb-icon
మెగాస్టార్ షేర్ చేసిన బెంగాలీ చిత్రం ట్రైలర్

‘అశ్వథ్థామ, భీష్మ, శ్యామ్ సింగరాయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో విలన్ గా నటించిన విలక్షణ బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్త. ఆయన బెంగాలీలో స్టార్ హీరో. ఈయన నటించిన తాజా బెంగాలీ చిత్రం ‘బాబా బేబీ ఓ’. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే (ఆదివారం) విడుదలైంది.  అరిత్ర ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోలంకి రాయ్ కథానాయిక. 40 ఏళ్ళ మేఘ్ .. సరోగసీ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి పరిచయం అయిన వృష్టి అనే అమ్మాయితో అతడి జీవితం ఎలా టర్న్ అయింది అనేదే ఈ సినిమా కథాంశం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి జిషు సేన్ కు విషెస్ తెలిపారు. 


‘ఫన్ అండ్ ఎమోషనల్ బెంగాలీ మూవీ ‘బాబా బేబీ ఓ’ ట్రైలర్ ను షేర్ చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా స్నేహితుడు జిషు సేన్ గుప్తాకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’..అని ట్వీట్ చేశారు చిరంజీవి.  చిరు ‘భోళాశంకర్’ మూవీలో విలన్ గా నటిస్తున్నారు జిషుసేన్ గుప్తా. అందుకే ఆయన జిషు బెంగాలీ చిత్రం ట్రైలర్ పై రెస్పాండ్ అయ్యారని అనుకోవచ్చు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement