Abn logo
Apr 7 2020 @ 18:45PM

‘ఫ్యామిలీ’ షార్ట్ ఫిల్మ్‌లో భాగమైనందుకు హ్యాపీ: చిరంజీవి

కరోనా ప్రభావంతో దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉంది. ఏప్రిల్ 14 వరకు ప్రజలను సామాజిక దూరం పాటించాలని వీలైనంతగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, ప్రియాంకా చోప్రా తదితర స్టార్లంతా కలిసి ‘ఫ్యామిలీ’ అనే ఓ షార్ట్ ఫిలిం చేశారు. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా, కల్యాణ్ జ్యూయలర్స్, అమితాబ్ ఆధ్వర్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకుంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ పరిశ్రమలో ఉన్న లక్ష మంది కార్మికులకు అందించనున్నారు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు.


అమితాబ్‌గారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్స్ అందరితో కలిసి రూపుదిద్దుకున్న ఈ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్‌లో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. దీని ద్వారా వచ్చే ఆదాయంతో భారత సినీ పరిశ్రమకు చెందిన లక్ష మంది సినీ కార్మికులకు సహాయం అందించాలనుకుంటున్నాము. దీనికి సహకరించిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా, కల్యాణ్ జ్యూయలర్స్‌కు ధన్యవాదాలు’’.. అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement