Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 09 Dec 2021 17:06:30 IST

‘RRR’ ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం వెయిటింగ్: మెగాస్టార్

twitter-iconwatsapp-iconfb-icon
RRR ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం వెయిటింగ్: మెగాస్టార్

‘గూస్‌బంప్స్’.. నేడు (గురువారం) విడుదలైన దర్శకధీరుడి ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి స్పందన ఇదే. ఇద్దరు స్టార్ హీరోలను, వారి అభిమానులను మ్యానేజ్ చేయడం.. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే.. అస్సలు సామాన్యమైన విషయం కానే కాదు. కానీ జక్కన్న అది చేసి చూపించారు. ఆ హీరో, ఈ హీరో అని కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చాటుతున్నారంటే.. ఏ రేంజ్‌లో ట్రైలర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అయితే బీభత్సం అంటూ ఈ ట్రైలర్‌పై ట్వీట్ చేశారు.


‘‘ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌పై స్పందించారు. ఇక ఈ ట్రైలర్ చూసిన మెగానందమూరి అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు. ఇద్దరూ హీరోలనూ సమ ఉజ్జీలుగా చూపించిన తీరుకి పొంగిపోతున్నారు. మరో చరిత్రని సృష్టించేందుకు టాలీవుడ్ వేదిక కాబోతోంది.. అనేలా కామెంట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement