Apr 21 2021 @ 10:22AM

కరోనాతో కన్నుమూసిన మెగా ఫ్యాన్స్.. చిరు సంతాపం

దేశం యావత్తును కరోనా వణికిస్తోంది. ఏడాది కాలం నుంచి పలు రంగాలను దెబ్బ తీసిన కరోనా, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో తీవ్ర రూపం దాల్చింది. సెలబ్రిటీలు, సామాన్యులు.. అందరూ కరోనా బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మెగాభిమానులు, ప్రసాద్‌ రెడ్డి, వెంకటరమణ కరోనా బారిన పడి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి షాక్‌కు గురయ్యారు. తన ట్విట్టర్‌ ద్వారా అభిమానుల మృతిపై ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణగారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి" అని తన అభిమానులతో ఉన్న ఫొటోను షేర్‌ చేసుకుని సంతాపాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.