చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా
ABN , First Publish Date - 2022-01-17T07:11:24+05:30 IST
‘మెగాస్టార్ చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని విధంగా నిలుస్తుంది’ అని సినీ నటుడు సప్తగిరి పేర్కొన్నారు.
సినీ నటుడు సప్తగిరి
తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘మెగాస్టార్ చిరంజీవి పక్కన ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నా జీవితంలో మర్చిపోలేని విధంగా నిలుస్తుంది’ అని సినీ నటుడు సప్తగిరి పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా మరిన్ని చిత్రాలతో అభిమానులను అలరిస్తానన్నారు. హీరోగా నటిస్తున్న ‘8’ చిత్రం మే నెలలో విడుదల అవుతుందన్నారు. ‘గోల్డ్మెన్’ చిత్రం కూడా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు చెప్పారు.