Abn logo
Sep 27 2020 @ 17:32PM

అభిమాని షేర్‌ చేసిన వీడియోతో చిరు ఫుల్‌ ఖుషి

Kaakateeya

మెగాస్టార్‌ చిరంజీవి.. సినిమాలు వదిలేసి కొంత కాలం పాటు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన కొన్నాళ్ల పాటు టూరిజం మినిస్టర్‌గా పనిచేశారు. సెప్టెంబర్‌ 27 వరల్డ్ టూరిజం డే సందర్భంగా.. మినిస్టర్‌గా ఆయన చేసిన గొప్ప పనులను వీడియో రూపంలో ఓ అభిమాని షేర్‌ చేయడంతో.. ఆ వీడియో చూసి మెగాస్టార్‌ ముగ్ధుడయ్యారు. చాలా సంతోషంగా ఉందంటూ.. ఆ క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

''ఒక అభిమాని పంపిన ఈ వీడియోని చూశాను. చాలా గౌరవంగా అనిపించింది. ఎన్నో సంతృప్తికర జ్ఞాపకాలను మరోసారి గుర్తు తెచ్చుకున్నాను. ఇంక్రెడిబుల్‌ ఇండియా కార్యక్రమం కోసం సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ సౌందర్యాన్ని వ్యాపింప జేసేందుకు నాకు తక్కువ సమయమే లభించినా.. అత్యుత్తమ సేవలు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గొప్ప జ్ఞాపకాలను అందుకున్నాను. జైహింద్.." అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Advertisement
Advertisement
Advertisement