Jun 11 2021 @ 12:55PM

మరో సామాజిక సేవా కార్యక్రమానికి ‘మెగా’ శ్రీకారం

కొవిడ్ పరిస్థితుల్లో ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సాయాన్ని అందిస్తూ పెద్ద మ‌న‌సును చాటుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్న చిరంజీవి త్వ‌ర‌లోనే అంబులెన్స్ స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఎప్పుడో నేత్ర‌దానం, రక్త‌దానం వంటి సామాజిక కార్య‌క్ర‌మాల‌తో ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి కొవిడ్ స‌మ‌యంలో  సీసీసీ అనే సంస్థ‌ను ప్రారంభించి ఇత‌ర సినీ తార‌ల స‌పోర్ట్‌తో సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. రీసెంట్‌గా త‌న అభిమానుల స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేశారు. అలాగే సినీ ప‌రిశ్ర‌మ‌తో మ‌మేక‌మైన అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్స్‌ను వేయిస్తున్నారు. ఇవ‌న్నీ కాకుండా అంబులెన్స్ స‌ర్వీసుల‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. అపోలో హాస్పిట‌ల్స్ స‌హా ఇత‌ర ప్రైవేటు హాస్పిట‌ల్స్ స‌హ‌కారంతో ఈ సేవ‌ల‌ను అందించ‌డానికి చిరంజీవి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.