యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు అగ్రహీరో చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న నాలుగు చిత్రాలు ఇప్పుడు సెట్స్ మీదున్నాయి. అందుకే ఈ నెల ఆయన కెరీర్లో అరుదైన నెల. ఒకేసారి నాలుగు సినిమాలకు సంబంధించిన షూటింగుల్లో ఆయన పాలు పంచుకుంటున్నారు. ఆయన హీరోగా నటస్తున్న ‘ఆచార్య’ చేస్తున్న విషయం తెలిసిందే! ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ కూడా సెట్స్‌పైకి వెళ్లాయి. ఇటీవల బాబీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల షూటింగులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. నాలుగు సినిమాలకు ఈ నెలలో డేట్లు కేటాయించారు చిరంజీవి. ఒకే నెలలో నాలుగు సినిమాల షూటింగుల్లో పాల్గొనడం చిరు కెరీర్లో ఇదే తొలిసారి. అందుకే ఈ డిసెంబరు కాస్త మెగాస్టార్ నెలగా మారిపోయింది. ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ కూడా రానుంది.