Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 May 2022 12:30:00 IST

యంగ్ డైరెక్టర్‌ను పక్కనపెట్టిన Chiranjeevi..?

twitter-iconwatsapp-iconfb-icon

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) యంగ్ డైరెక్టర్‌ను పక్కన పెట్టారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమా చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' (Lucifer) సినిమాకి తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan), నయనతార (Nayanathara), సత్యదేవ్ (Sathadev), దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అలాగే, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. అలాగే, బాబి దర్శకత్వంలో మెగా 154 షూటింగ్ కూడా జరుగుతోంది. మాస్ మహారాజ రవితేజ ఇందులో మరో హీరోగా, శృతి హాసన్ చిరు సరసన హీరోయిన్‌గా కనిపించబోతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. ఆయన లేకుండా కూడా ఇతర తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. అయితే, యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula)కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరు కొన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారట. వెంకీ కుడుముల నరేట్ చేసిన స్క్రిప్ట్ వెర్షన్‌పై కాస్త అసంతృప్తిగా ఉన్నారట. మరి ఇది ఎంతవరకు నిజమోగానీ, తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ ఆగినట్టే అంటున్నారు. చూడాలి దీనిపై మేకర్స్ క్లారిటీ ఎప్పుడు ఇస్తారో. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement