Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య ఒక రుషి మాదిరిగా సేవ చేశారు: చిరంజీవి

హైదరాబాద్: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని కొనియాడారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని చిరంజీవి పేర్కొన్నారు. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా రోశయ్య ఆహ్వానించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement