ఇంతలోనే ఈ వార్త వింటామని ఊహించలేదు: సిరివెన్నెల మృతిపై చిరంజీవి

ABN , First Publish Date - 2021-12-01T15:30:03+05:30 IST

చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు ఎవరూ కూడా భర్తీ చేయలేరని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఇంతలోనే ఈ వార్త వింటామని ఊహించలేదు: సిరివెన్నెల మృతిపై చిరంజీవి

హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు ఎవరూ కూడా భర్తీ చేయలేరని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సమాజాన్ని మేల్కొలిపే సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవన్నారు. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పాను. తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పానన్నారు. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదన్నారు. కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లే ముందే తనతో ఫోన్లో మాట్లాడారని.. పుట్టిన వెంటనే ఎవరు కూడా మెగాస్టార్ కాలేరని చాలా సందర్భాల్లో తనతో అనేవారన్నారు. 

Updated Date - 2021-12-01T15:30:03+05:30 IST