Abn logo
Apr 7 2020 @ 21:31PM

తమ్ముడు చేస్తానంటే ఆ సినిమా ఇచ్చేస్తా: చిరంజీవి

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి మలయాళంలో ఘన విజయం సాధించిన పొలిటికల్ డ్రామా చిత్రం ‘లూసిఫర్’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారని, చిరంజీవి హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందంటూ ఆ మధ్య వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.


ప్రస్తుతం చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం తర్వాత ఏ సినిమా చేయబోయేది ఇంకా ఏమీ అనుకోలేదని అన్నారు. ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే చెబుతానని అన్నారు. అలాగే చేయబోయే ‘లూసిఫర్‌’ రీమేక్‌కి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ధారించుకోలేదని అన్నారు. ‘లూసిఫర్’ చిత్రాన్ని పవన్ కల్యాణ్ చేస్తున్నాడనే వార్తలకి కూడా చిరు వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికైతే తాను ఆ సినిమా చేయాలని అనుకుంటున్నానని, ఒకవేళ తన తమ్ముడు ఆ సినిమా చేయాలని ఉత్సాహపడితే మాత్రం తప్పకుండా తనకి ఇచ్చేస్తానని తెలిపారు. తనకు చేయాలనుందనే వార్త అయితే నా వరకూ రాలేదని చిరంజీవి అన్నారు.


చిరంజీవి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement