Abn logo
Jun 2 2020 @ 16:10PM

చిరంజీవి, బాలయ్య ఏం చేస్తారు?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మలయాళ సినిమా రీమేక్‌ల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ త్వరలో మలయాళ రీమేక్ సినిమాల్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.


`లూసిఫర్` రీమేక్‌లో చిరంజీవి, `అయ్యప్పనుమ్ కోషియమ్`లో బాలకృష్ణ, `డ్రైవింగ్ లైసెన్స్`లో పవన్‌కల్యాణ్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూడు సినిమాలూ తెలుగు నేటివిటీకి సరిపోవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తిగా మలయాళ రాజకీయ, మత ప్రాతిపదికల ఆధారంగా తెరకెక్కిన సినిమాలని, వాటిని తెలుగులో చూడరని అంటున్నారు. `లూసిఫర్` రీమేక్ చేసేందుకు చిరంజీవి ఇప్పటికే ఓకే చెప్పగా.. `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ గురించి బాలయ్య ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి, ఈ విశ్లేషణలు చిరు, బాలయ్య నిర్ణయాలపై ప్రభావం చూపుతాయేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement