ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరు, చరణ్‌ల విరాళం రూ. 50 లక్షలు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ ముందడుగు వేసింది. ఇప్పటికే గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ రూ. 10 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.


‘‘ఆంధ్రపదేశ్‌లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకి నా వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి 25 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను..’’ అని చిరంజీవి ట్వీట్ చేయగా.. ‘‘ఇటీవల సంభవించిన వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అలా ఇబ్బందులు పడుతున్నవారికి సహాయంగా నా వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25 లక్షలు అందిస్తున్నాను..’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.Advertisement