భార‌త్‌లో తొలి క‌రోనా వ్యాక్సిన్ ప‌రీక్ష ఇత‌నిపైనే!

ABN , First Publish Date - 2020-07-08T15:19:45+05:30 IST

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వాలంటీర్ చిరంజీత్ ధీవర్‌పై కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పరీక్షించడానికి కోవిడ్ కరోనావైరస్ వ్యాక్సిన్ ఇండియా అంగీకరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఏరోనాటికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లోని భువనేశ్వర్ సెంటర్‌లో ఈ టీకాను...

భార‌త్‌లో తొలి క‌రోనా వ్యాక్సిన్ ప‌రీక్ష ఇత‌నిపైనే!

రాంచీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వాలంటీర్ చిరంజీత్ ధీవర్‌పై కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పరీక్షించడానికి కోవిడ్ కరోనావైరస్ వ్యాక్సిన్ ఇండియా అంగీకరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఏరోనాటికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లోని భువనేశ్వర్ సెంటర్‌లో ఈ టీకాను మానవులపై పరీక్షించనున్నారు. చిరంజీత్‌కు ఈ విష‌య‌మై ఫోను వచ్చింది. ఈ టీకా ప‌రీక్ష‌కు ఎప్పుడు రావాలో తెలియ‌జేస్తామ‌ని సంబంధిత అధికారులు అత‌నికి తెలిపారు. మొదట పట్నా కేంద్రంలో ఈ ప‌రీక్ష నిర్వహించాల‌నుకున్నారు.  అయితే ఆ తరువాత భువనేశ్వర్ కేంద్రంలో ఈ పరీక్ష చేయాల‌ని నిర్ణయించారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా ఈ  కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం గమనార్హం. ఈ టీకా ఆగస్టు 15 కు సిద్ధంగా ఉంటుంద‌ని వారు గ‌తంలో ప్ర‌క‌టించారు. కాగా చిరంజీత్ ధీవ‌ర్‌ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో పాఠశాల ఉపాధ్యాయుడు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత జాతీయ విద్యా సమాఖ్య ప్రాథ‌మిక యూనిట్ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడు. ఈ సంద‌ర్భంగా చిరంజీత్ మీడియాతో మాట్లాడుతూ  తాను క‌రోనా టీకా పరీక్ష కోసం  ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకున్న‌న‌ని తెలిపారు. ఇటీవ‌ల ఈ టీకా ప‌రీక్ష‌కు త‌న‌ను ఎంపిక‌చేసిన‌ట్లు సంబంధిత అధికారుల నుంచి ఫోన్ వ‌చ్చింద‌న్నారు. ఇందుకోసం తాను త్వ‌ర‌లో భువ‌నేశ్వ‌ర్ వెళ్లాల్సి ఉంటుంద‌న్నారు. ఈ ప‌రీక్ష‌కు తాను మానసికంగా సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. చిరోంజీత్ తండ్రి తపన్ ధీవ‌ర్ మాట్లాడుతూ త‌న‌ కొడుకు క‌రోనా వ్యాక్సిన్ ప‌రీక్ష‌కు ముందుకు రావ‌డాన్ని అంద‌రూ మెచ్చుకుంటున్నార‌ని అన్నారు. 

Updated Date - 2020-07-08T15:19:45+05:30 IST