చీరాల కరోనా పాజిటివ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

ABN , First Publish Date - 2020-03-29T22:21:04+05:30 IST

చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చీరాల కరోనా పాజిటివ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

ప్రకాశం: చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కాంటాక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందినవారు సుమారు 280 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మరో 200 మంది, చీరాల రైల్వేస్టేషన్‌లో 80 మంది దిగినట్టు తెలుస్తోంది. వీరి గుర్తింపులో జాప్యం జరిగితే భారీ మూల్యం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జిల్లాలో 5 వేల మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-03-29T22:21:04+05:30 IST