శరవేగంగా చింతపల్లి- సీలేరు రోడ్డు పనులు

ABN , First Publish Date - 2022-05-20T06:01:31+05:30 IST

ఏజెన్సీలో చింతపల్లి నుంచి సీలేరు వరకు జరుగుతున్న రోడ్డు పనులు వేగవంతం కావాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు,

శరవేగంగా చింతపల్లి- సీలేరు రోడ్డు పనులు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం 

పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో చింతపల్లి నుంచి సీలేరు వరకు  జరుగుతున్న రోడ్డు పనులు వేగవంతం కావాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు, ఏజెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులు పూర్తి చేయాలని, చింతపల్లి- సీలేరు రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే తాజంగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చింతపల్లి మండలం రాజుపాకలు నుంచి అంజలిశనివారం రోడ్డు పనులు మందకొడిగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ డీవీఆర్‌ఎం రాజు, రోడ్లు భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:01:31+05:30 IST