Chittoor Dist.: తిరుపతిలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

ABN , First Publish Date - 2022-07-26T19:20:12+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ.. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షా నిర్వహించింది.

Chittoor Dist.: తిరుపతిలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

తిరుపతి (Tirupathi): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ.. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షా (Satyagraha Deeksha) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ (Chintamohan) మాట్లాడుతూ  బీజేపీ (BJP), వైసీపీ (YCP) ప్రభుత్వాల విధానాలను తప్పు పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లోనూ వ్యాధులు ప్రబలుతున్నాయని, అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలు అధికమయ్యాయన్నారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మోదీ సర్కార్ (Modi Sarkar) ముందుకు వెళుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు.


బీజేపీ ప్రభుత్వం ఈడీ (ED) ద్వారా సోనియా (Sonia), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లను ఇబ్బందులకు గురి చేయడం అప్రజాస్వామీకమని చింతామోహన్ అన్నారు. దానివల్ల సోనియా గాంధీ కుటుంబానికి నష్టమేమీ లేదని, ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేయడం అభినందనీయమేనని.. అయితే ఆదివాసులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి వైపు నడిపించామన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి తిరోగమనం వైపు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యం కావాలని, అభివృద్ధి నిరోధకులుగా మారిన పాలక  ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని చింతామోహన్ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-07-26T19:20:12+05:30 IST