Sangareddy : పటాన్చెరు(Patancheru) మండలం చినకంజర్లలో కోడిపందాలు పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగాయి. 21 మంది పందాల రాయుళ్లను అరెస్ట్ చేశారు. 31 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar)తో పాటు మరో 40 మంది పరారీలో ఉన్నారని పటాన్ చెరు డీఎస్పీ వెల్లడించారు. కోడిపందాల ఘటనపై సోషల్మీడియా వేదికగా చింతమనేని స్పందించారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపిస్తున్నారని వాపోయారు. నీచమైన ప్రచారంతో... కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మీ మేడ కూలిపోయే సమయం అసన్నమైందని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.