దేశంలో పెరిగిన ఆర్థిక అసమానతలు: చింతా మోహన్‌

ABN , First Publish Date - 2021-10-14T00:26:37+05:30 IST

దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మెహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం

దేశంలో పెరిగిన ఆర్థిక అసమానతలు: చింతా మోహన్‌

నెల్లూరు: దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మెహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాక్షాత్తు కేంద్రమంత్రి కుమారుడు రైతులపై విచక్షణ రహితంగా వాహనం తొలి ఎందరో ప్రాణాలు పోయేందుకు కారుకుడు అయ్యాడని దుయ్యబట్టారు. రైతాంగ చట్టాలను నిర్వీర్యం చేసేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనేగాక రాష్ట్రంలోనూ విద్యుత్‌ సంక్షోభం నెలకొంటోందని, కరెంటు కోతలు ఎక్కువవుతాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరు మెదపడం లేదని చింతా మోహన్‌ తప్పుబట్టారు. 

Updated Date - 2021-10-14T00:26:37+05:30 IST