ఆ విషయంలో దీక్ష చేస్తా.:చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2022-02-27T20:09:12+05:30 IST

సోనియా గాంధీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటలని వమ్ము చేశారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు.

ఆ విషయంలో దీక్ష చేస్తా.:చిన్నారెడ్డి

హైదరాబాద్: సోనియా గాంధీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటలని వమ్ము చేశారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’’టీపీసీసీ అనుమతిస్తే నిరుద్యోగుల కోసం నేను గాంధీ భవన్‌లో అమరణ నిరాహార దీక్ష చేస్తా. నిరుద్యోగుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. బీజేపీ , టీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ జంగ్ సైరన్ బహిరంగ సభని నిర్వహించింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదు.ఫీజ్ రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు చనిపోతున్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది’’ అని చిన్నారెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-27T20:09:12+05:30 IST