టీఆర్ఎ‌స్ అస్సలు పోటీ ఇవ్వదు: చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2021-03-04T19:04:28+05:30 IST

హైదరాబాద్,మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎ‌స్ అస్సలు పోటీ..

టీఆర్ఎ‌స్ అస్సలు పోటీ ఇవ్వదు: చిన్నారెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్, మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో  టీఆర్ఎ‌స్ అస్సలు పోటీ ఇవ్వదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి‌లో కాంగ్రెస్  ఆధ్వర్యంలో హైదరాబాద్, మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర‌రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. పది రోజులు తన కోసం పని చెయ్యండి.. ఆరేళ్లు మీకోసం పనిచేస్తానని చెప్పారు. పెద్ద నాయకులు పార్టీ మారిన కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. ధైర్యంగా పనిచేయాలని చెప్పారు. ఈసారి ఎప్పుడు లేని విధంగా 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యలోనే పోటీ ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఏనాడు కౌన్సిల్‌లో ఒక్క సమస్యపైన ప్రశ్నించిన దాఖలాలు లేవని తెలిపారు. అలాంటి వ్యక్తి గెలవడం వల్ల ఉపయోగం లేదు. ఎనిమిదేళ్లు ఎమ్మెల్సీగా ఉన్న ప్రోఫె‌సర్ నాగేశ్వర్ రావు ఒక్క పని చేయలేదన్నారు. కానీ తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా ఉండి పలు సమస్యలను పరిష్కరించి ప్రజలకు అండగా ఉంటున్నానని తెలిపారు.  పనిచేసే నాయకుడినని.. పట్టభద్రులు ఆలోచించి తనను గెలిపించి కౌన్సిల్‌కు పంపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. లక్ష 91 వేల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చెయ్యాలని కోరుతున్నానని తెలిపారు. నన్ను గెలిపిస్తే వెంటనే ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని ముఖ్యమంత్రి‌ కేసీఆర్‌కి వినతి‌పత్రం అందజేసి సమస్యలపై పోరాడుతానని  చెప్పారు. ఒక వేల స్పదించకుంటే  సీఎం ఇంటి ముందు ఆమరణ దీక్ష చేస్తానని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-04T19:04:28+05:30 IST