ఆలయాలపై దాడులు బాధాకరం

ABN , First Publish Date - 2021-01-24T07:01:36+05:30 IST

హిందూ దేవాలయాలపై దాడులు బా ధాకరమని త్రిదండి చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. హిందూదేవాలయాల పరిరక్షణలో భాగంగా శనివారం కళ్యాణదుర్గం, రాయ దు ర్గం ప్రాంతాల్లో స్వామి పర్యటించారు.

ఆలయాలపై దాడులు బాధాకరం

త్రిదండి చినజీయర్‌స్వామి

కళ్యాణదుర్గం/రాయదుర్గంటౌన్‌, జనవరి 23: హిందూ దేవాలయాలపై దాడులు బా ధాకరమని త్రిదండి చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. హిందూదేవాలయాల పరిరక్షణలో భాగంగా శనివారం కళ్యాణదుర్గం, రాయ దు ర్గం ప్రాంతాల్లో స్వామి పర్యటించారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, భట్టువానిపల్లిలోని దేవాలయాలను సందర్శించారు. ఇటీవల కోళ్లూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశా రు. దీంతో ఆ ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఘటనపై ఆరాతీశారు. అనంతరం భక్తులనుద్దేశించి స్వామి ప్రసంగించారు. ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటం బాధాకరమన్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రతిఒక్కరూ దేవుళ్లపై నమ్మ కం ఉంచాలన్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆలయ కమిటీ సభ్యులు గరికపాటి హరికృష్ణ, మంజునాథ్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ దంపతులు ఇంటికి ఆహ్వానించారు.


పశుపతి నాథుడి ఆలయ సందర్శన

రాయదుర్గం మండలం చదం కొండపై ఉన్న చతుర్ముఖ పశుపతినాథుడి ఆలయాన్ని చినజీయర్‌ స్వామి సందర్శించారు. అనంతరం పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమంటపంలో భక్తులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతి, మాజీ మం త్రి కాలవ శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విప్‌ రామచంద్రారెడ్డి స్వామి చేతుల మీదుగా రూ.1,00,116 విరాళం అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, ప్రముఖ వైద్యుడు గోపాల్‌రావు, మాజీ వైస్‌చైర్మన్‌ మహబూబ్‌ బాషా, సిమెంటు శీనా, కేడిమి తిప్పేస్వామి, మురళి, ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామనాథం, రామ్మూర్తిస్వామి, స్వామి అర్చనానంద, నీలకంఠస్వామి పాల్గొన్నారు.




Updated Date - 2021-01-24T07:01:36+05:30 IST