చైనాలో కలకలం.. కోలుకున్న 6 నెలలకు మళ్లీ కరోనా..!

ABN , First Publish Date - 2020-08-13T03:32:41+05:30 IST

కరోనా సంక్షోభం ప్రారంభమైన తొలి నాళ్లలో ఆ వైరస్ బారినపడి కోలుకున్న ఓ వృద్ధురాలు మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు ఆరు నెలల తరువాత కరోనా పాజిటివ్‌గా తేలింది.

చైనాలో కలకలం.. కోలుకున్న 6 నెలలకు మళ్లీ కరోనా..!

బీజింగ్: కరోనా సంక్షోభం ప్రారంభమైన తొలి నాళ్లలో ఆ వైరస్ బారినపడి కోలుకున్న ఓ వృద్ధురాలు మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు ఆరు నెలల తరువాత కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యులను, ప్రభుత్వాధికారులను ఆందోళనలోకి నెట్టేస్తున్న ఈ ఘటన చైనాలో జరిగింది. సదరు మహిళ ఫిబ్రవరి నెలలో తొలిసారి కరోనా పాజిటివ్‌గా తేలిందని అక్కడి వైద్యాధి కారులు తెలిపారు. ఆ తరువాత ఆమె కోలుకుని తన దైనందిన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. అయితే ఇటీవల ఆమెలో మళ్లీ కరోనా వ్యాధి లక్షణాలు కనబడటంతో స్థానిక డాక్టర్లు కరోనా టెస్టుకు సూచించారు. ఇందులో ఆమె మళ్లీ కరోనా బారినపడ్డట్టు వెల్లడైంది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే.. దేహం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది.

Updated Date - 2020-08-13T03:32:41+05:30 IST