Tokyo Olympics: ఇద్దరు చైనీస్ గోల్డ్‌మెడలిస్టుల నిర్వాకం.. దర్యాప్తునకు ఆదేశించిన ఐఓసీ

ABN , First Publish Date - 2021-08-04T19:29:55+05:30 IST

ఒలింపిక్స్‌లో ఇద్దరు చైనీస్ సైక్లిస్ట్స్ చేసిన నిర్వాకం ఇప్పుడు వైరల్ అవుతోంది. సైక్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన బావో షాంజు, ఝాంగ్ టియాన్షి‌ ఈ నిర్వాకానికి పాల్పడ్డారు.

Tokyo Olympics: ఇద్దరు చైనీస్ గోల్డ్‌మెడలిస్టుల నిర్వాకం.. దర్యాప్తునకు ఆదేశించిన ఐఓసీ

టోక్యో: ఒలింపిక్స్‌లో ఇద్దరు చైనీస్ సైక్లిస్ట్‌లు చేసిన నిర్వాకం ఇప్పుడు వైరల్ అవుతోంది. సైక్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన బావో షాంజు, ఝాంగ్ టియాన్షి‌ ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. దీంతో తాజాగా ఒలింపిక్ కమిటీ వారిపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా? పతకాలు అందుకునే సమయంలో పోడియంపై వారి దేశానికి చెందిన మాజీ నేత మావో జెడాంగ్ బ్యాడ్జీలతో కనిపించారు. ఒలింపిక్ చార్టర్ అర్టికల్ 50 ప్రకారం రాజకీయ ప్రకటనలు చేయడం గానీ, రాజకీయ నేతలను, పార్టీలను గుర్తుకు తెచ్చేలా బ్యాడ్జీలను వాడడం నిషేధం. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక కోసం చైనీస్ ఒలింపిక్ కమిటీని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సంప్రదించింది. దర్యాప్తు అనంతరం ఒలింపిక్ నియామవళిని ఉల్లంఘించిన బావో షాంజు, ఝాంగ్ టియాన్షిపై ఐఓసీ చర్యలకు ఉపక్రమించనుంది.    

Updated Date - 2021-08-04T19:29:55+05:30 IST