Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 24 Mar 2022 13:45:31 IST

ఆఫ్ఘనిస్థాన్‌ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి

twitter-iconwatsapp-iconfb-icon
ఆఫ్ఘనిస్థాన్‌ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి

కాబూల్ : చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్ చేరుకున్నారు. ఆయన ఇస్లామిక్ ఎమిరేట్ నేతలతో చర్చలు జరుపుతారు. పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన నేరుగా ఇస్లామాబాద్ నుంచి కాబూల్ వెళ్ళారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మద్ యాసిర్ మాట్లాడుతూ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం కాబూల్ చేరుకున్నారని, ఆయన ఇస్లామిక్ ఎమిరేట్ నేతలతో చర్చలు జరుపుతారని తెలిపారు. 


చైనా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య 76 కిలోమీటర్ల మేరకు సరిహద్దులు కలుస్తాయి. చైనాలోని జింజియాంగ్‌లో ఉన్న వీఘర్ ముస్లింలకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయమిచ్చే అవకాశం ఉందని చైనా భయపడుతోంది. గత ఏడాది ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా దళాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి. తాలిబన్లతో సంబంధాలను కొనసాగించేందుకు చైనా మొగ్గు చూపుతోంది. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశాలతో చైనా ఓ సమావేశాన్ని వచ్చే వారంలో నిర్వహించబోతోంది. తాలిబన్ల నేతృత్వంలోని ఈ దేశానికి  ఏవిధంగా సహాయం చేయగలమనే అంశంపై చర్చించబోతోంది.


 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.