మాది విస్తరణవాదం అనడం తప్పు: చైనా

ABN , First Publish Date - 2020-07-04T00:37:49+05:30 IST

బీజింగ్: లడక్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. విస్తరణవాద శకం ముగిసి అభివృద్ధి వాద యుగం ప్రారంభమైందన్న మోదీ వ్యాఖ్యలను చైనా తప్పుబట్టింది.

మాది విస్తరణవాదం అనడం తప్పు: చైనా

బీజింగ్: లడక్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. విస్తరణవాద శకం ముగిసి అభివృద్ధి వాద యుగం ప్రారంభమైందన్న మోదీ వ్యాఖ్యలను చైనా తప్పుబట్టింది. తమది విస్తరణ వాదం కాదని భారత్‌లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి  జి రోంగ్ తెలిపారు. సరిహద్దు వివాదాలున్న 14 దేశాలకు గాను 12 దేశాలతో చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు. వివాదాలు పరిష్కరించుకుని స్నేహ సహకారాలు పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తమను విస్తరణవాదులుగా చిత్రీకరించడం తగదంటూ ట్వీట్ చేశారు. 



అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్ మాట్లాడుతూ చైనాను తప్పుగా అర్ధం చేసుకోవద్దన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను కాపాడుకుంటూనే సరిహద్దుల వద్ద శాంతిని పాటించాలని సూచించారు. 

   



Updated Date - 2020-07-04T00:37:49+05:30 IST