Abn logo
Sep 24 2021 @ 21:17PM

China: తుపాకితో ఇండియన్స్‌ను కాల్చి పడేస్తా.. చిన్నారుల దుస్తులపై చైనా కంపెనీ క్యాప్షన్లు!

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనాకు భారత్ అంటే ఎంత అసూయో, ఎంత ద్వేషమో మరోమారు వెల్లడైంది. ఆ దేశానికి చెందిన జేఎన్‌బీవై అనే దుస్తుల కంపెనీ భారతీయులపై ద్వేషాన్ని నింపేలా చిన్నపిల్లల దుస్తులపై క్యాప్షన్లు ప్రింట్ చేసింది. ‘‘ఈ ప్రాంతమంతా భారతీయులతో నిండిపోయింది. తుపాకి తీసుకుని వీళ్లందరినీ కాల్చి పడేస్తా’’ అని ప్రింట్ చేసింది. అలాగే, ‘వెల్కమ్ టు హెల్’, ‘లెట్ మి టచ్ యూ’ వంటి క్యాప్షన్లు ముద్రించింది.


 తన నాలుగేళ్ల కుమారుడి కోసం కుటుంబ సభ్యులు కొని తెచ్చిన దుస్తులపై ఉన్న ఈ స్లోగన్లు చూసి మొగుమోగు విస్తుపోయింది. ఆమెకు ఇంగ్లిష్ రావడంతో ఆ క్యాప్షన్లు చదివి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ టీషర్టుపై ఇండియన్స్‌ను కాల్చి పడేస్తా అని ప్రింట్ చేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నాలుగేళ్ల పిల్లాడు ఇలాంటి టీ షర్టు ధరిస్తాడని తలచుకుంటేనే భయమేస్తోందంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ టీషర్టుపై ఉన్న క్యాప్షన్‌ను షేర్ చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


టీ షర్టులపై ప్రింట్ చేసిన క్యాప్షన్లు వివాదం కావడంతో దుస్తుల కంపెనీ క్షమాపణ చెప్పింది. నిజానికి వాటిపై ఆ క్యాప్షన్లు ఎలా ప్రింట్ అయ్యాయో తమకు తెలియని వివరణ ఇచ్చింది. అయితే, భారతీయులను కించపరుస్తూ చేసిన క్యాప్షన్లపై మాత్రం పెదవి విప్పకపోవడం గమనార్హం.  

ఇవి కూడా చదవండిImage Caption