చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌

ABN , First Publish Date - 2021-12-29T17:41:32+05:30 IST

దాల్చిన చెక్క- రెండు అంగుళాలు, లవంగాలు- నాలుగు, మిరియాలు- నాలుగు, సోంపు- అర స్పూను, అనాస పువ్వు

చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌

కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క- రెండు అంగుళాలు, లవంగాలు- నాలుగు, మిరియాలు- నాలుగు, సోంపు- అర స్పూను, అనాస పువ్వు- ఒకటి, అల్లం ముక్కలు- అర స్పూను, నువ్వుల నూనె- మూడు స్పూన్లు, ఉల్లి కాడలు- ముప్పావు కప్పు, బాస్మతి బియ్యం- కప్పున్నర, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు, క్యాబేజీ ముక్కలు- కప్పు, క్యాప్సికమ్‌- పావు కప్పు, ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావు కప్పు, మిరియాల పొడి- అర కప్పు, ఉల్లికాడలు- పావు కప్పు, ఉప్పు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని అర గంట పాటు నానబెట్టాలి. చెక్క, లవంగాలు, మిరియాలు, సోంపు, అనాస పువ్వును మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బాణలిలో నువ్వుల నూనె కాగాక అల్లం ముక్కలు వేయించాలి. తరవాత ఉల్లికాడలు జతచేయాలి. మిగతా కూరగాయలన్నీ వేసి ఓ నిమిషం పాటు మగ్గించాలి. మిరియాల పొడి, ఉప్పుతోపాటు తగినన్ని నీళ్లు కలిపి మూత పెట్టి ఉడికించాలి.. అయిదు నిమిషాల తరవాత బియ్యాన్ని కూడా వేసి తక్కువ మంట మీద మరో పావు గంట ఉడికిస్తే చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌ రెడీ. పైన ఉల్లికాడల్ని చల్లితే లుక్‌ అద్దిరిపోతుంది.

Updated Date - 2021-12-29T17:41:32+05:30 IST