ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్ కుర్రాడిని అప్పగించిన చైనా

ABN , First Publish Date - 2022-01-27T21:42:07+05:30 IST

అరుణాచల్‌ప్రదేశ్‌లో అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం భారత సైన్యానికి అప్పగించింది.

ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్ కుర్రాడిని అప్పగించిన చైనా

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. ఆ తర్వాతి రోజు అరుణాచల్‌ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ గావో మాట్లాడుతూ.. తరోన్‌ను చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అప్పర్ సియాంగ్ జిల్లాలో కిడ్నాప్ చేసిందని ఆరోపించారు.


దీంతో తరోన్‌ కోసం భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో అదృశ్యమైన తరోన్‌ను గుర్తించామంటూ ఈ నెల 23న చైనా ఆర్మీ భారత్‌కు సమాచారం అందించింది. తాజాగా, కుర్రాడికి వైద్య పరీక్షలు నిర్వహించి, అప్పగింతలకు సంబంధించి ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత భారత సైన్యానికి తరోన్‌ను అప్పగించినట్టు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.   

Updated Date - 2022-01-27T21:42:07+05:30 IST