తప్పుడు పనుల్ని సమర్ధిoచడానికి సిగ్గనిపించలేదా?: చినరాజప్ప
ABN , First Publish Date - 2022-01-18T02:44:28+05:30 IST
తప్పుడు పనుల్ని సమర్ధిoచడానికి సిగ్గనిపించలేదా?: చినరాజప్ప
అమరావతి: వైసీపీ నేతల తప్పుడు పనుల్ని సమర్ధిoచడానికి మంత్రి కన్నబాబుకి సిగ్గనిపించడం లేదా? అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. సంక్రాంతి సoబరాల్లో వైసీపీ నేతల అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి తెచ్చిన మీడియాపై మంత్రి కన్నబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతoలో జరిగే ఉత్సవాలే ఏ ఏడాది జరిగాయనడం ఆయన దివాలుకోరుతనానికి నిదర్శనమన్నారు. గతంలో ఏ సంక్రాంతి కైనా రాష్ట్రంలో క్యాసినో నిర్వహించారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సంక్రాంతి అంటే సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించామన్నారు. కానీ నేడు వైసీపీ హయాంలో సంక్రాంతి ని జూద క్రీడలు, అసాoఘిక కార్యకపాలకు వేదిక మార్చి తెలుగు, సంస్కృతి, సంప్రదాయాలను మంట గలిపారని మండిపడ్డారు.