మైనింగ్‌లో వైసీపీ నేతల దోపిడీ తారాస్థాయికి చేరింది: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-05-13T21:19:01+05:30 IST

మైనింగ్‌లో వైసీపీ నేతల దోపిడీ తారాస్థాయికి చేరిందని నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

మైనింగ్‌లో వైసీపీ నేతల దోపిడీ తారాస్థాయికి చేరింది: చినరాజప్ప

అమరావతి: మైనింగ్‌లో వైసీపీ నేతల దోపిడీ తారాస్థాయికి చేరిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో పేలుళ్లు జరిగిన క్వారీ వైసీపీ ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్య కుటుంబసభ్యుల పేరుతో ఉందన్నారు. పేలుళ్ల ఘటనకు బాధ్యుడంటూ అసలు లీజుదారులను వదలేసి, సబ్ లీజుదారుని  అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ జరిగిందని, గతంలో రూ.46 లక్షలు చెల్లించాలని అసలు లీజుదారులకు నోటీసులు కూడా అందాయన్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ ద్వారా రూ.100 కోట్ల ముగ్గురాయిని తరలించారన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్సీ సీ.రామచంద్రయ్యపై చర్యలు తీసుకోవాలని, ఆయనకు సహకరించిన మైనింగ్ శాఖాధికారులపై తక్షణమే చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వమే పరిహారం అందించాలన్నారు. పేలుళ్ల ఘటనపై వాస్తవాలతో తాము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నుంచి ఎవరొస్తారో రావొచ్చునని చినరాజప్ప సవాల్ చేశారు.

Updated Date - 2021-05-13T21:19:01+05:30 IST