Taiwan : చైనా మాపై యుద్ధానికి సిద్ధమవుతోంది : తైవాన్

ABN , First Publish Date - 2022-08-09T16:48:22+05:30 IST

వాయు, నౌకాదళ డ్రిల్స్‌ పేరిట చైనా తమ దేశాన్ని చుట్టుముట్టిందని తైవాన్ వ్యాఖ్యానించింది. డ్రిల్స్ యుద్ధ కసరత్తుగా ఉపయోగించుకుంటోందని తైవాన్ విదేశామంగ జోసెఫ్ వూ అన్నారు.

Taiwan : చైనా మాపై యుద్ధానికి సిద్ధమవుతోంది : తైవాన్

తైపీ : వాయు, నౌకాదళ డ్రిల్స్‌(Drills) పేరిట చైనా(China) తమ దేశాన్ని  చుట్టుముట్టిందని తైవాన్(Taiwan) ఆందోళన వ్యక్తం చేసింది. డ్రిల్స్‌ను యుద్ధ కసరత్తుగా ఉపయోగించుకుంటోందని ఆ దేశ  విదేశామంగ జోసెఫ్ వూ(Joseph Wu) అన్నారు. తైవాన్‌పై దాడితో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో యథాస్థితికి భంగం కలిగించాలన్నదే చైనా లక్ష్యమని పేర్కొన్నారు. కాగా గతవారం అమెరికా(USA) ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి(Nancy Pelosi) తైవాన్‌లో పర్యటించడం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో గతవారం యుద్ధ కసరత్తు(Drills) మొదలుపెట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అకస్మాత్తుగా చైనా దాడి చేస్తే ప్రతిఘటించేందుకు తైవాన్ మిలిటరీ ‘లైవ్-ఫైర్ డ్రిల్స్’(Live Fire drills) నిర్వహించిన అనంతరం జోసెఫ్ వూ మీడియాతో మాట్లాడారు. 


తైవాన్ ప్రజలను నైతికంగా బలహీనం చేయడమే టార్గెట్‌గా చైనా సైన్యం భారీ కసరత్తులు, క్షిపణ ప్రయోగాలు, సైబర్ దాడులు, దుష్టప్రచారంతోపాటు ఆర్థికను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని జోసెఫ్ వూ పేర్కొన్నారు. డ్రిల్స్ వారం వరకే జరుగుతాయని తొలుత చెప్పినా.. సోమవారం కూడా కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా వాయు, నౌకా మార్గంలో చైనా డ్రిల్స్ ఆటంకంగా మారాయన్నారు. 


చైనా డ్రిల్స్ ‘తైవాన్ మూల హక్కుల’ను ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డారు. తైవాన్ చుట్టూ ఉన్న జలాలు, విస్తృతమైన ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై నియంత్రణ కోసమే చైనా ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తైవాన్ జల సంధి(Taiwan Strait )తోపాటు ఈ ప్రాంత యథాస్థితిలో మార్పులు చేపట్టడంపై చైనా గురిపెట్టిందన్నారు. చైనాకు వ్యతిరేకంగా నిలబడ్డ పశ్చిమ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిరంకుశత్వ దాడులతో ప్రజాస్వామ్య మనుగడ కష్టమని ప్రపంచ గుర్తించాలని ఈ సందర్బంగా జోసెఫ్ వూ సందేశమిచ్చారు.

Updated Date - 2022-08-09T16:48:22+05:30 IST