రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన చైనా

ABN , First Publish Date - 2021-11-06T23:13:40+05:30 IST

అంతరిక్ష ప్రయోగాల్లో ఇటీవల దూకుడు పెంచిన చైనా తాజాగా మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉప గ్రహాలను నింగిలోకి

రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన చైనా

బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో ఇటీవల దూకుడు పెంచిన చైనా తాజాగా మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉప గ్రహాలను నింగిలోకి పంపింది. యోగాన్-35కు చెందిన వీటిని లాంగ్ మార్చ్-2డి కేరియర్ రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. లాంగ్ మార్చ్ సిరీస్ కేరియర్ రాకెట్ పరంపరలో ఇది 396వ మిషన్ అని చైనా అధికారిక మీడియా తెలిపింది. 


2019లో చైనా లాంగ్ మార్చ్ -3బి రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అది 300వ ప్రయోగం కాగా, ఈ సిరీస్‌లో తాజా ప్రయోగం 396వది. ఈ రాకెట్‌లను చైనా ఏరో స్పేస్ ఏజెన్సీ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.


చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో 96.4 శాతం ఈ రాకెట్ల ద్వారానే జరగడం గమనార్హం. తొలి వంద ప్రయోగాలను చేపట్టేందుకు లాంగ్ మార్చ్ రాకెట్లకు 37 ఏళ్లు పడితే ఆ తర్వాత వంద ప్రయోగాలను 7.5 ఏళ్లలో, మూడోసారి వంద ప్రయోగాలను నాలుగేళ్లలో పూర్తి చేయడం విశేషం. సగటు ప్రయోగాలు ఏడాదికి 2.7 శాతం నుంచి 13.3 శాతానికి, ఆ తర్వాత ఇప్పుడు 23.5 శాతానికి చేరుకున్నట్టు జిన్హువా పేర్కొంది. 

Updated Date - 2021-11-06T23:13:40+05:30 IST