చైనాలోని హుబే ప్రావిన్స్‌లో మొదలైన విమాన సేవలు

ABN , First Publish Date - 2020-03-30T06:33:56+05:30 IST

సూక్ష్మజీవి కరోనా వైరస్ చైనాలోని హుబే ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రావడంతో అధికారులు రోజురోజుకూ

చైనాలోని హుబే ప్రావిన్స్‌లో మొదలైన విమాన సేవలు

బీజింగ్: సూక్ష్మజీవి కరోనా వైరస్ చైనాలోని హుబే ప్రావిన్స్‌లో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రావడంతో అధికారులు రోజురోజుకూ ఒక్కో సేవను పున ప్రారంభిస్తున్నారు. ఈ నెల 25 నుంచి హుబే ప్రావిన్స్‌లో రవాణా సేవలను ప్రభుత్వం పునరుద్దరించింది. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ సేవలను కూడా తిరిగి ప్రారంభించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వూహాన్‌ మాత్రం ఇంకా లాక్‌డౌన్‌లోనే ఉంది. ఏప్రిల్ 8 నుంచి వూహాన్‌లో కూడా లాక్‌డౌన్ తీసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వూహాన్‌లోని టియానే ఎయిర్‌పోర్ట్ తప్పించి హుబే ప్రావిన్స్‌లోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లు ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. శనివారం చైనా వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదయ్యాయని.. వీటిలో ఒకటి స్థానిక వ్యక్తి ద్వారా సోకినట్టు చైనీస్ నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. స్థానిక వ్యక్తి ద్వారా సోకిన కేసు హెనాన్ ప్రావిన్స్‌లో నమోదైనట్టు తెలిపింది. కాగా.. ఎన్‌హెచ్‌సీ లెక్కల ప్రకారం.. చైనాలో ఇప్పటివరకు మొత్తంగా 81,439 కేసులు నమోదవ్వగా.. వీరిలో 3300 మంది మృత్యువాతపడ్డారు. 75,448 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2,691 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-03-30T06:33:56+05:30 IST