Chinaలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్

ABN , First Publish Date - 2022-03-15T13:39:11+05:30 IST

కరోనా మహమ్మారి పుట్టిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది....

Chinaలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు...పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్

బీజింగ్ (చైనా): కరోనా మహమ్మారి పుట్టిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనా దేశంలో మంగళవారం ఒక్కరోజే మునుపటి రోజు కంటే రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే చైనాలో 5,280 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. చైనా దేశంలోని 18 ప్రావిన్సులలో ఒమైక్రాన్, డెల్టా వేరియెంట్ లతో జనం సతమతమవుతున్నారు. దీంతో షాంఘై నగరంలో అధికారులు పాఠశాలలను మూసివేశారు. షెన్ జెన్ దక్షిణ టెక్ పవర్ హౌస్ తోపాటు ఈశాన్య నగరాల్లోని పరిసరాలను పాక్షికంగా లాక్ చేశారు. జిలిన్ నగరంలో పాక్షికంగా లాక్ డౌన్ చేశారు. 


ఉత్తర కొరియా సరిహద్దుల్లోని  పట్టణ ప్రాంతమైన యాన్జీలో కరోనా కేసులతో 7 లక్షలమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.జిలిన్ నగరంలోనే 2,200 కరోనా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.చాంగ్ చున్ నగరంతోపాటు మరో మూడు చిన్న నగరాల్లో మార్చి 1వతేదీ నుంచి లాక్ డౌన్ విధించారు.చాంగ్ చున్ హెల్త్ కమిషన్ అధిపతిని ఉద్యోగం నుంచి తొలగించామని సర్కారు తెలిపింది.కరోనా కేసులు పెరిగేకొద్దీ చైనా దేశంలో జాతీయ ఆరోగ్య కమిషన్ యాంటిజెన్ పరీక్షలను ముమ్మరం చేసింది.


Updated Date - 2022-03-15T13:39:11+05:30 IST